WGL: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.