Pakistan cracks down on Imran Khan's supporters after violence
Imran Khan’s supporters:పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్టుతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లాహోర్‌లో గల పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టి.. పెట్రోల్ బాంబులు విసిరారు.
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన 500 మందికిపైగా మద్దతుదారులు బుధవారం మోడల్ టౌన్ లాహోర్‌లోని ప్రధాని నివాసానికి (Pm home) చేరుకుని అక్కడ పార్క్ చేసిన వాహనాలకు నిప్పు అంటించారు. ప్రధాని ఇంటిపై పెట్రోల్ బాంబులు కూడా విసిరారు అని పంజాబ్ పోలీసు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో ప్రధాని నివాసం వద్ద కేవలం గార్డులు మాత్రమే ఉన్నారు. అక్కడున్న పోలీసు పోస్టుకు కూడా నిప్పు పెట్టారు. భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకోగానే పీటీఐ ఆందోళనకారులు పారిపోయారని తెలిపారు.
అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం అరెస్టు అయ్యారు. అవినీతి కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను (Imran Khan) పారామిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కోర్టు విచారణ చేపట్టారు. అవినీతి కేసులపై ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) ప్రశ్నించేందుకు పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏబీ కోర్టును కోరింది. 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 17న ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.