TG: హైదరాబాద్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీభవన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.