TPT: రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతలతో వాహనదారులే కాకుండా నడిచివెళ్లే వారికి సైతం ఇబ్బందులు తప్పవు. ఇదేదో మారుమూల పల్లెటూరి రోడ్డు అనుకుంటే పొరపాటే. కోట నుంచి నాయుడుపేటకు వెళ్లే ప్రధాన రోడ్డు ఇది. వానొస్తుంది అంటే ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు హడలిపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.