E.G: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని, ప్రతిభను చాటుకోవడంతో పాటు వివిధ రంగాలను శాసిస్తున్నారని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి అన్నారు. శనివారం రాజమండ్రిలో MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.