TG: ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. వాళ్లు లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోయిన మావోయిస్టు మాజీ నేతలతో తానే స్వయంగా చర్చలు జరిపి.. రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి చర్చించానని వెల్లడించారు.