ప్రస్తుతం చిరు, బాలయ్య సినిమాల మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి.. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీ నుండి జై బాలయ్య అనే సాంగ్ రిలీజ్ అయింది.
ప్రస్తుతం ఈ రెండు పాటల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరు సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా.. బాలకృష్ణ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. దాంతో ఈ ఇద్దరి మధ్య వార్ నువ్వా, నేనా అన్నట్టుంది. పైగా ఇద్దరు పోటీ పడి మరీ ఆ పాటలలో హీరోలకు ధీటుగా రచ్చ చేశారు. ముఖ్యంగా తమన్ మాస్ స్టెప్పులతో రచ్చ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ ఇద్దరిపై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతోంది. డీజె వీరయ్య, జై బాలయ్య సాంగ్స్ కాపీ కొట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టి’ సాంగ్ ఎప్పుడో శింబు నటించిన తమిళ సినిమా ‘సిలంబట్టమ్’లోని ‘వేరీజ్ ద పార్టీ’ పాటలా ఉందంటున్నారు. దేవీశ్రీ రాసిన లిరిక్స్ కూడా గతంలో లాగా లేదని అంటున్నారు. దాంతో దేవిశ్రీ నుంచి కొత్త దనం కావాలంటున్నారు. ఇకపోతే.. అసలే తమన్ పై కాపీ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి.
ఇప్పుడు కూడా మరోసారి తమన్ పై అలాంటి ట్రోలింగే జరుగుతోంది. జై బాలయ్య సాంగ్.. ఓసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ మాదిరిగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా దేవి, తమన్ ఇద్దరు కూడా కాపీ ట్యూన్ అందించారంటూ.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియాలంటే.. ఓ సారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి.. మీకే అర్థమవుతుంది.