»Ipl 2023 Sunrisers Hyderabad Beat Rajasthan Royals By 4 Wickets
TATA IPL నో బాల్ తో వరించిన అదృష్టం.. రాజస్థాన్ పై హైదరాబాద్ గెలుపు
రాజస్థాన్ భారీ స్కోర్ చేయడం తో దాదాపు గెలుపు ఆ టీమ్ కే దక్కుతుందని అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య వరస మ్యాచుల్లో సన్ రైజర్స్ ఓడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో.. అందరూ రాజస్థాన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ సన్ రైజర్స్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది.
ఐపీఎల్ 2023లో (TATA IPL) భాగంగా ఆదివారం సాయత్రం జరిగిన మ్యాచ్ (Match) చాలా ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) పోటీపడ్డాయి. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి. చివరి వరకు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ సాగింది. లాస్ట్ లో నో బాల్ (No ball) మ్యాచ్ ఫలితం మార్చేసింది. అప్పటి వరకు రాజస్థాన్ దే విజయం అని అనుకున్నారు. కానీ చివరకు సన్ రైజర్స్ ఆ విజయాన్ని (Victory) కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ (Toss) గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler).. 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson).. 38 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. రాజస్థాన్ భారీ స్కోర్ చేయడం తో దాదాపు గెలుపు ఆ టీమ్ కే దక్కుతుందని అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య వరస మ్యాచుల్లో సన్ రైజర్స్ ఓడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో.. అందరూ రాజస్థాన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ సన్ రైజర్స్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66 నాటౌట్), యశస్వి జైస్వాల్ (35) ముగ్గురూ మంచి స్కోర్లు చేశారు. ముఖ్యంగా శాంసన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ ఛేజింగ్‌ను సన్‌రైజర్స్ కూడా బాగానే మొదలు పెట్టింది. ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) (Abhishek Sharma) ఇద్దరూ అద్భుతమైన ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (47) (Rahul Tripathi) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ అవుటైన తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిక్ క్లాసెన్ (12 బంతుల్లో 26) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (6) పెద్దగా ప్రభావం చూపలేదు. చివర్లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. అతను క్రీజులో ఉండి ఉంటే సన్‌రైజర్స్ సులభంగా గెలిచేది. కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయిన ఫిలిప్స్ పెవిలియన్ చేరాడు. దీంతో సన్‌రైజర్స్ ఒక్క బంతిలో నాలుగు పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పుడు సందీప్ వేసిన బంతిని సమద్ చక్కని షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు. దీంతో సన్‌రైజర్స్ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్.. సందీప్ కనుక ఆ నోబాల్ వేయకపోతే కచ్చితంగా రాజస్థాన్ గెలిచేదని అంటున్నారు.