NZB: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలకు దిగడం ముమ్మాటికి అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుందని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.