SKLM: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన క్యాంపు కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను సూచించారు. మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, వారి సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.