కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని(Ap Health minister vidadala Rajani) సందర్శించారు. నంద్యాలలోని సర్వజన ఆస్పత్రిలో అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ క్రమంలో ఎస్ఎన్ సీయూ విభాగంలోకి వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు. ఆ శిశువు ఏడుస్తుండగా మంత్రి విడదల రజిని చలించిపోయారు. వెంటనే శిశువును ఎత్తుకుని ప్రేమగా లాలించారు. పసిబిడ్డను ముద్దు చేస్తూ నవ్వించారు. దీంతో అక్కడున్నవారంతా ఆ దృశ్యాన్ని చూసి చిరునవ్వు చిందించారు. ప్రస్తుతం విడుదల రజిని పసిబిడ్డను లాలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి రజిని చేసిన పనికి పలువురు ప్రశంసిస్తున్నారు.