SRD: అమీన్పూర్ డివిజన్ గండిగూడెంలోని శ్రీ కాశి విశ్వనాథ అభయాంజనేయ స్వామి టెంపుల్ 10వ వార్షికోత్సవం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో పాల్గొన్నారు. దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.