Pawan Kalyan: అదిరింది.. OG సినిమాతో పవన్ వారసుడి ఎంట్రీ!?
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది పవన్ ఆర్మీ. కానీ కాస్త ముందుగానే అకీరా నందన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
పవన్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ మాటలను బట్టి.. అకీరా(Akhira) హీరో అవుతాడా? లేదా? అనే డైలమాలో ఉన్నారు మెగాభిమానులు(Mega Fans). ఇప్పటికే అకీరా హీరో అయ్యేందుకు ఏమేం కావాలో.. అవన్నీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అకీరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే అకీరా హీరోనా కాదా? అనేది పక్కన పెడితే.. ఓజితో మాత్రం అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్టు.. ఇప్పుడో సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం సుజిత్(Director sujith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో పవన్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడని అంటున్నారు. అందులో ఓ క్యారెక్టర్ టీనేజ్ కుర్రాడిగా దాదాపు 15 నిమిషాల ఉంటుందట.
ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అయితే పెర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నాడట సుజీత్. ఇప్పటికే ఈ ప్రపోజల్ పవన్ ముందు పెట్టేశాడని టాక్. త్వరలోనే దీనికి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ అకిరా నందన్‌ను పవన్ తన సినిమాతో పరిచయం చేస్తే మాత్రం.. ఓజి హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోతుంది. ఒక్క పవన్ అనే కాదు. గతంలో మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో.. వారసులను సిల్వర్ స్క్రీన్ చూపించారు. ఇక ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. కాకపోతే అకీరా నందన్ హీరో కటౌట్ వచ్చాక ఎంట్రి ఇస్తున్నాడని చెప్పొచ్చు. మరి నిజంగానే ఓజి(OG)లో అకీరా కనిపిస్తాడో.. లేదో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.