ADB: ఉట్నూర్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న అధ్యాపకురాలిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు జాదవ్ సోమేశ్ డిమాండ్ చేశారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులు హాస్టల్లో ఉంటూ చదవుకుంటున్న గిరిజన విద్యార్థినిలను బూతులు తిట్టడం సరికాదన్నారు.