Brahmanandam Campaign:కర్ణాటక ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీ నేతలు ఉన్నారు. హీరోలు, తారలను రంగంలోకి దింపారు. బీజేపీ తరఫున సుదీప్ ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం బొమ్మైతో రిషబ్ శెట్టి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మంత్రి కే సుధాకర్ (sudhakar) తరఫున ప్రచారం చేస్తున్నారు. చిక్ బళ్లపూర్లో జోరుగా క్యాంపెయిన్ చేశారు. మరోసారి సుధాకర్‌ను గెలిపించాలని బ్రహ్మానందం కోరారు. ఇక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉండటం.. బ్రహ్మానందాన్ని చూసేందుకు భారీగా జనం వస్తున్నారు. సుధాకర్ తనకు మంచి మిత్రుడు అని చెబుతున్నారు. మూవీ డైలాగ్స్ చెప్పి.. అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు.
కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుత ట్రెండ్ బట్టి చూస్తే కాంగ్రెస్ లీడ్ పొజిషన్లో ఉంది. అధికార బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.