»Election Campaigns In Karnataka Shocking Adr Report
Karnataka Elections: కర్ణాటకలో హోరాహోరి ఎన్నికల ప్రచారాలు..షాకిస్తోన్న ఏడీఆర్ నివేదిక
కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఏడీఆర్ నివేదిక అందరికి షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారిలో మొత్తం 404 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Elections) దగ్గరపడటంలో ఎన్నికల ప్రచారం(Election Campaign) జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ కూడా హోరా హోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ప్రచారాలు తుది దశలో ఉండటంతో ఏడీఆర్(ADR) నివేదిక కలకలం రేపుతోంది. ఎలక్షన్ వాచ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక చర్చనీయాంశమైంది. కర్ణాటక ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో నేరచరితులు ఎక్కువగా ఉన్నారంటూ ఆ నివేదిక వెల్లడించింది.
కర్ణాటక(Karnataka)లో గతంతో పోలిస్తే ఈసారి నేర చరిత్ర ఉన్న వారు పెరిగారని ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. ఏడిఆర్ నివేదిక ప్రకారంగా చూస్తే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిని చూస్తే కాంగ్రెస్ పార్టీకి 31 శాతం, బీజేపీకి 30 శాతం, జేడీఎస్ కు 25 శాతం మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు(Criminal Cases) కలిగి ఉన్నారని తెలుపుతోంది.
బీజేపీలో గత ఎన్నికల్లో 83 మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉండగా ఈ సారి ఆ సంఖ్య 93కు చేరినట్లు ఏడీఆర్ నివేదిక తెలుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో 59 మందిపై క్రిమినల్ కేసులు ఉండేవని ఆ సంఖ్య ఇప్పుడు 122కి చేరిందని ఏడీఆర్ తెలుపుతోంది. జేడీఎస్ లో కూడా గతంలో 41 మంది అభ్యర్థులు ఉంటే ఈసారి 70 మంది అయ్యారని, ఆప్ అభ్యర్థుల్లో 30 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే ఎన్నికల్లో(Karnataka Elections) పోటీ చేసేవారిలో 8 మందిపై హత్యానేరం, 35 మందిపై హత్యాయత్న నేరం, 49 మందిపై మహిళలకు వ్యతిరేకంగా నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్(ADR) సర్వే తన నివేదిక ద్వారా కలకలం రేపింది.