KNR: గంగాధర మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కళాశాల విద్య కమిషనర్ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.