మేడ్చల్ జిల్లాలో పత్తి రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పత్తి కాయలు మొలకెత్తిన పరిస్థితి ఏర్పడిందని, రైతన్నలు వాపోయారు. ప్రభుత్వం ధరను పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కూలీల కొరత సైతం రైతులను వేధిస్తుంది.