HYD: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నగరంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్, అత్తాపూర్, మెహదీపట్నం, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. అనేక మంది దీపావళి పండుగకు సొంతూరుకు వెళ్లారు. ఇదే అదునుగా పండగ పూట ప్రైవేట్ వాహనాల యజమానులు ఛార్జీలు పెంచేశారు.