బంగారం ధరలు(Gold Rates) ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలను చూసి బంగారం కొనేవారు షాక్ అవుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో గురువారం ఉదయం బంగారం ధర(Gold Rates) భారీ స్థాయిలో పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.61,490లకు చేరింది. ఇదే జీవితకాల అత్యధిక రేటు అని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్ లో బంగారం ధర(Gold Rates) ఔన్సుకు 2081.80 డాలర్లకు చేరింది. ఇంత భారీ డాలర్లకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. ఇకపోతే భారత మార్కెట్లలో చూసుకున్నట్లైతే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.61,490కి చేరింది. 2023లో ఇప్పటి వరకూ కూడా బంగారం ధర(Gold Rates) దాదాపు 12 శాతం పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధర(Gold Rates) ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. భారీ ధర పెరగడంతో బంగారం కొనుగోలు చేసే ఆలోచనను సామాన్యులు వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇక శుభకార్యాలు ఉన్న వారు మాత్రం బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదిఏమైనా బంగారం ధర(Gold Rates) ఆల్ టైమ్ రికార్డు(All Time Record)కు చేరుకోవడంతో బంగారం కొనుగోలు వ్యాపారం కాస్త మందగించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.