»Thalapathy Vijays Ghilli All Time Record In Re Releases
Thalapathy Vijay: రీ రిలీజ్‌లలో అరుదైన రికార్డు సాధించిన దళపతి
‘సూపర్ స్టార్’ మహేష్ బాబు పోకిరితో మొదలై రీ-రిలీజ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. అందరూ అదే ధోరణిని ఫాలో అవుతూ లాభాలు గడిస్తున్నారు. అదే తరహాలో తమిళ సినిమా ఇండస్ట్రీ సైతం ఈ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తోంది.
Thalapathy’ Vijay’s Ghilli: All Time Record In Re-Releases
Thalapathy Vijay: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు పోకిరితో మొదలై రీ-రిలీజ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. అందరూ అదే ధోరణిని ఫాలో అవుతూ లాభాలు గడిస్తున్నారు. అదే తరహాలో తమిళ సినిమా ఇండస్ట్రీ సైతం ఈ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తోంది. మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీని తమిళంలో గిల్లీ అంటూ విజయ్ రీమేక్ చేశాడు. 2004లో విజయ్, త్రిష కాంబోలో వచ్చిన ఈ రీమేక్ మూవీ గిల్లీ రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందట. 200 రోజులు చాలా సెంటర్లలో ఆడిందట. విజయ్ కెరీర్లో గిల్లీ అనేది ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండటంతో పెద్ద సినిమాలేవీ రిలీజ్ చేయడం లేదట. అందుకే విజయ్ పాత మూవీ గిల్లీని రీ రిలీజ్ చేశారు.
విజయ్ గిల్లీ చిత్రాన్ని ఏప్రిల్ 20న తమిళనాడుతో పాటుగా, ఓవర్సీస్లోనూ భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. దాదాపు 800 థియేటర్లలో ఈ మూవీని మళ్లీ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. రీ రిలీజ్ డే సందర్భంగా గిల్లీ మూవీకి దాదాపు పది కోట్ల గ్రాస్ వచ్చి ఉంటుందని తమిళ నాడు మీడియా వార్తలు రాసుకొస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్ బేస్ గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. రీ రిలీజ్ లలో ఇంత కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని.. దటీజ్ తళపతి అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.