భోళా శంకర్ వంటి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత.. కెరీర్ బెస్ట్ మూవీ చేస్తున్నట్టుగా విశ్వంభర సినిమాను చెబుతున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే కాదు.. చిరు కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
Vishwambhara: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చిరు ఇష్టదైవం హనుమంతుని విగ్రహం నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ ‘విశ్వంభర’ ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఇది కేవలం సినిమాలో మాత్రమే కాదు.. మెగాస్టార్ కెరీర్లోనే బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుందని అంటున్నారు. ‘విశ్వంభర’ సెట్స్‌కి వెళ్లిన సినీ ప్రముఖులు, యూనిట్ వర్గాలు చెబుతున్న మాట ఇది. సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందట. అందుకే.. ఈ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా.. చిరు కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. మెగాభిమానులకు విశ్వంభర సినిమా ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుంది.
అంతేకాదు.. ఈ సినిమాలో మెగాస్టార్ కెరీర్ బెస్ట్ ఫైట్స్ ఉంటాయని సమచారం. భారీ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రానికి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బింబిసార’ సార వంటి హిట్ తర్వాత వశిష్ట చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ‘స్టాలిన్’ విడుదలైన 18 ఏళ్లకు మళ్లీ ఈ జంట కలిసి పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి.