Kalki 2898 AD: ఇంకెప్పుడు.. నిరాశ పరిచిన ‘కల్కి’ కొత్త గ్లింప్స్!
నిజమే.. లేటెస్ట్గా రిలీజ్ చేసిన కల్కి 2898ఏడి ప్రభాస్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచందనే చెప్పాలి. గ్లింప్స్ అదిరిపోయినప్పటికీ ఓ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. దీంతో.. ఇంకెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kalki 2898 AD: ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ కల్కి 2898ఏడి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు మరింతగా పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి అమితాబచ్చన్‌కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్‌కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా అమితాబ్ నటిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో అమితాబచ్చన్ని రెండు భిన్నమైన లుక్స్‌లో చూపించారు. యంగ్ అశ్వద్ధామగా, మహర్షి లుక్‌లో అమితాబ్ కనిపించారు. అమితాబ్ యంగ్ లుక్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. డీఏజింగ్ ద్వారా యంగ్ అమితాబ్ లుక్ చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నాగ్ అశ్విన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్టడీ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీంతో.. ఖచ్చితంగా కల్కి సినిమా విజువల్ వండర్ అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్స్. అయితే.. గ్లింప్స్ అదిరిపోయేలా ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు. వాస్తవానికైతే.. మే 9న కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందంటున్నారు. అయితే.. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. కొత్త రిలీజ్ డేట్ మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. అమితాబ్ గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఇస్తారని అనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇంకప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. మరి కల్కి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.