raj tarun : హీరోలు కెరీర్లో బిజీగా ఉన్నంత సేపు పెళ్లి చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఈ విషయమై ఎప్పుడు వాళ్లని ప్రశ్నించినా ఏదో ఒక సమాధానం చెప్పు దాటేసేస్తూ ఉంటారు. అయితే హీరో రాజ్ తరణ్ మాత్రం ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను జీవితాంతం పెళ్లి( Marriage) చేసుకోకుండానే ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. పెళ్లి, పిల్లలు వద్దు, సింగిల్‌గా ఉండటమే హ్యాపీగా ఉందని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజ్‌తరుణ్ ఈ రకంగా స్పందించారు.
మొదట్లో తన తల్లి తరచుగా పెళ్లి గురించి తనను అడుగుతూ ఉండేవారని చెప్పారు. తన తండ్రి మాత్రం ఎప్పుడూ ‘నీ ఇష్టం’ అంటూ వచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు తన తల్లి కూడా తన ఇష్టానికే ఈ విషయాన్ని వదిలేశారని అన్నారు. దీంతో తాను జీవితాంతం పెళ్లి( Marriage) చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టాలీవుడ్లో ప్రభాస్, నవదీప్, సాయి ధరమ్ తేజ్, అఖిల్ లాంటి వారు పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంది. అయితే వీరిని ఎప్పుడు అడిగినా టైం రావాలనో, నచ్చిన అమ్మాయి దొరకాలనో చెప్తున్నారు.
రాజ్ తరుణ్(Raj Tarun) మాత్రం మిగిలిన బ్యాచిలర్ హీరోలకు భిన్నంగా అసలు పెళ్లే చేసుకోనని చెప్పేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఇప్పుడీ కామెంట్స్ ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. నిజంగా పెళ్లి చేసుకోకుండా ఉంటాడేమో చూద్దాం అంటూ సోషల్ మీడియా వేదికలపై అంతా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌తరుణ్ సినిమాలు, సిరీస్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. తిరగబడరా సామీ, భలే ఉన్నాడో, పురుషోత్తముడు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.