»Indias Gukesh D Makes History Becomes Youngest To Win Candidates Chess Tournament
chess : విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ విజేతగా గుకేష్
అతి చిన్న వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ట్రోఫీ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడీ విజయాన్ని ఎలా దక్కించుకున్నాడంటే...?
FIDE CANDIDATES 2024 : కెనడా వేదికగా జరిగిన ఫిడి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ గెలిచిన భారతీయ అతి చిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అలాగే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.
చివరి వరకు విజేత ఎవరో తేలని ఉత్కంఠ పోరులో గుకేష్(Gukesh) విజేతగా నిలిచాడు. అదెలాగంటే.. 13వ రౌండ్ వరకు గుకేష్ 8.5 పాయింట్లతో ఉన్నాడు. 14వ రౌండ్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడికి మరో 9 పాయింట్లు లభించాయి. మరో వైపు రష్యాకు చెందిన నెపోమ్నిషియా, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాల మధ్య గేమ్ కూడా డ్రా అయ్యింది. దీంతో వారిద్దరికి 8.5 పాయింట్ల దగ్గర ఆగిపోయారు.
ఇలా ఇరువురి చెస్(chess) గేమ్‌లు డ్రా కావడంతో లీడ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ గుకేష్ ఫిడే క్యాండిడేట్స్(FIDE CANDIDATES) చెస్ టోర్నమెంట్‌ని దక్కించుకున్నాడు. ఈ విజయం సాధించడంతో గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆ పోటీ లోనూ గుకేష్ విజయం సాధిస్తే అతి చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్ లిస్ట్‌లో తన పేరును నమోదు చేసుకుంటాడు. అయితే ఈ పోటీకి ఇంకా తేదీలు ఖరారు కాలేదు. గతంలో 22 ఏళ్లకు మాగ్నస్ కార్ల్సన్, కాస్పరోవ్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు.