»India Emerges As Second Largest Source Of New Us Citizens Congressional Report Reveals
Citizenship : అత్యధికంగా అమెరికా సిటిజన్‌షిప్ పొందిన దేశాల్లో రెండో స్థానంలో భారత్
అత్యధికంగా అమెరికా సిటిజన్‌షిప్ పొందిన రెండో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 2022లో అత్యధికంగా మెక్సికన్లకు అమెరికా సిటిజన్‌షిప్ రాగా ఆ తర్వాతి స్థానంలో భారతదేశం నిలిచింది.
American Citizenship : ఉద్యోగాల కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంత మంది మాత్రం అక్కడి పౌరసత్వాన్ని ఏటా పొందుతూ వస్తున్నారు. అయితే 2022లో మొత్తం 1,28,878 మంది మెక్సికన్లకు అమెరికా సిటిజన్‌షిప్(US CITIZENSHIP) వచ్చింది. ఆ తర్వాత 65,960 మంది భారతీయులకు ఈ పౌరసత్వం లభించింది. దీంతో అత్యధికంగా అమెరికా పౌరసత్వాలు లభించిన దేశంగా భారత్(INDIA) రెండో స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరంలో మొత్తంగా 59వేల మందికి సిటిజన్‌షిప్ లభించింది. ఈ విషయమై సీఆర్ఎస్ ఓ నివేదికను వెల్లడించింది.
నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం… 2022లో మెక్సికో, భారత్‌ల తర్వాత ఫిలిప్పీన్స్ నుంచి అత్యధికంగా 53,413 మందికి సిటిజన్‌షిప్(CITIZENSHIP) వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనా దేశాల వారు ఉన్నారు. అమెరికా సిటిజన్‌షిప్ పొందడానికి పలు అంశాలను వారు పరిగణలోకి తీసుకుంటారు. పుట్టిన దేశంతోపాటు, ఐదేళ్ల ఎల్‌పీఆర్‌లు అయి ఉండాలి. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్థాన్ వారికి కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు.
అమెరికాలో పౌరసత్వం కోసం 2023 సంవత్సరం చివరి నాటికి మొత్తం 4,08,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్పీఆర్ ఉన్నవారు సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో ఉంటున్న దాదాపు 90 లక్షల మందికి దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. అయినప్పటికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు వచ్చాయని సీఆర్ఎస్ నివేదిక వెల్లడించింది.