ఏ మాత్రం గ్యాప్ లేకుండా.. తిరిగి మళ్లీ ముంబైలో వాలిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్‌గానే హైదరాబాద్‌కి వచ్చిన ఎన్టీఆర్.. దేవర షూటింగ్లో జాయిన్ అవుతాడు అనుకుంటే.. తిరిగి ఇప్పుడు వార్2 సెట్స్‌లోకి అడుపెట్టాడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో హిందీ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వస్తున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గానే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. పది రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ పై కీలక సీన్స్ షూట్ చేశారు. దీంతో.. చిన్న బ్రేక్ ఇచ్చి తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు తారక్.
చదవండి:raj tarun : పెళ్లి, పిల్లలు వద్దంటున్న రాజ్‌తరుణ్
దీంతో దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తిరిగి వార్2 కోసం ముంబైకి వెళ్లాడు. ఆదివారం ముంబయికి బయలు దేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ షర్ట్, జీన్స్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించాడు యంగ్ టైగర్. ఇదే ‘వార్ 2’ గెటప్ అని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరో వారం రోజుల పాటు ముంబైలో జరగనున్న వార్2 షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. తిరిగి వచ్చాక దేవర షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అక్టోబర్ 10న దేవర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. హృతిక్‌తో ఎన్టీఆర్ చేస్తున్న వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి.