తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
Thamilisai : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరిగి బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్గా పనిచేశారు. ఆమె గత 20 ఏళ్లుగా బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో తమిళి సై గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందుకే లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానాల నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ గవర్నర్గా తమిళి సాయి 2019 సెప్టెంబర్ 8న నియమితులైన సంగతి తెలిసిందే.