Complaint to Minister Ponnam CS that RDO had recorded his phone call
Ponnam Prabhakar: తన ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్షాలకు పంపించారంటూ హన్మకొండ ఆర్డీఓపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సీఎస్ శాంతకుమారి(Shantha kumari)ని కోరారు. ఇలాంటి సంఘటనల వలన స్థానికంగా ఎలాంటి అశాంతి నెలకొంటుందో తెలియదా అని మరొక్కసారి పునారవృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్(Congress)తో కరువు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. పంటనష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల గురించి ఓ రికార్డు వైరల్ అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మార్వోకు ఫోన్ చేసి ఆ చెక్కలను స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకుండా నేరుగా అధికారులే పంపిణీ చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన సంభాషణ రికార్డు చేసి ప్రతిపక్షాలకు ఇచ్చినట్లు మంత్రి ఆరోపిస్తున్నారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. స్థానిక ఎమ్మెల్యే లబ్దిదారులకు పంపిణిీ చేస్తే తప్పేంటని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.