CP Radhakrishnan sworn in as Governor of Telangana
CP Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) నేడు బాధ్యతలు తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే రాధాకృష్ణన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ గవర్కర్ తమిళ సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము(Draupadimurmu) ఆయన్ను నియమించింది. నేడు ఆయన ప్రమాణం చేసిన తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణన్ ఇప్పుడు అదనంగా తెలంగాణలో కూడా విదవి చేబట్టారు. సీపీ రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు. తమిళసై రాజీనామా చేసిన తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, సీపీ రాధాకృష్ణన్ వీరు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం.