South Central Railway: చాలామంది రైలు కదులుతుంటే ఎక్కడం, దిగడం వంటివి చేస్తారు. ఇలాంటి చేయడం చట్టరీత్యా నేరమని, ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. భద్రత విషయంలో ప్రయాణికులు రైల్వేశాఖకు సహకరించాలని తెలిపింది. రైలు బయలుదేరే సమయంలో రైళ్లు ఎక్కవద్దు, దిగవద్దు. నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించవద్దు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సబ్‌వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జీలను వాడాలి. ట్రాక్‌ల దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ, ఫొటోగ్రఫీ తీసుకోకూడదు. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం రైల్వే ట్రాక్‌ను దాటడం చట్టరీత్యా నేరం. ఇలా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి వరకు జరిమానా ఉంటుంది. లేదా రెండు శిక్షలు కూడా విధిస్తారు.