Kanguva: ‘కంగువ’ టీజర్ రిలీజ్.. భయంకరంగా ఉన్న సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏకంగా పది భాషల్లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉంది. సూర్య భయంగకరంగా కనిపిస్తున్నాడు.
Kanguva: సూర్య నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కంగువ’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా నటిస్తున్నాడు. యుద్ధ వీరుడు అంటే సాదా సీదా వీరుడు కాదు.. అతి భయంకరమైన వీరుడుగా సూర్య లుక్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. తాజాగా రిలీజ్ అయిన కంగువ సిజిల్ పేరుతో రిలీజ్ అయిన టీజర్ చూస్తే.. వావ్ అనేలా ఉంది.
ముఖ్యంగా కంగువ అద్భుతమైన విజువల్ వండర్‌గా రాబోతుందని చెప్పొచ్చు. ఇక సూర్య లుక్ అయితే మామూలుగా లేదు. 51 సెకండ్ల ఈ టీజర్‌ను ఒక్క డైలాగ్ కూడా లేకుండా హై ఓల్టేజ్ గూస్ బంప్స్‌గా కట్ చేశారు. పెరుమాచి అంటూ.. సూర్య గాండ్రింపు అదిరిపోయింది. ఖచ్చితంగా సూర్య కెరీర్ బెస్ట్ మూవీగా కంగువ నిలిచేలా ఉంది. అయితే.. సూర్యతో పాటు విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్ కూడా ఈ టీజర్లో పవర్ ఫుల్‌గా కనిపించాడు.
టీజర్లో ఈ ఇద్దరి లుక్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఈ టీజర్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. మొత్తంగా.. ఒక్కో షాట్ గూస్ బంప్స్ అనేలా.. విజువల్ గ్రాండియర్‌గా కంగువ టీజర్ ఉంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి కంగువ ఎలా ఉంటుందో చూడాలి.