»Election Commission Strict Action Will Be Taken If You Participate In Election Campaign
Election Commission: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు
ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వాళ్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు.
Election Commission: ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వాళ్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా హెచ్చరించారు. పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతులు పొందటం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటేమనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేస్తే ఐపీసీలోని సెక్షన్ 171, 123, 129, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134ఏ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలతోపాటు సర్వీసు బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాలు ప్రకటించటానికి వీల్లేదు.
బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం. వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రారంభం కాని పనులేవీ ఇప్పుడు చేపట్టకూడదు. పూర్తయిన పనులకు సంబంధించిన నిధుల విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులు, బహిరంగ ప్రదేశాలపై ఉన్న గోడరాతలు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలి. ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఆడియో, వీడియోల వంటివి వెంటనే తీసేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాలి. కోడ్ ఉల్లంఘన విషయంలో ఏ శాఖపైనైనా ఫిర్యాదులొస్తే సకాలంలో స్పందించిన తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.