»Rahul Gandhi We Will Deposit Rs 1 Lakh In Womens Bank Accounts
Rahul Gandhi: మహిళ బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష డిపాజిట్ చేస్తాం
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈక్రమంలో రాహుల్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ ఖాతాల్లోకి కొంత డబ్బును జమ చేస్తామని తెలిపారు.
Rahul Gandhi: We will deposit Rs.1 lakh in women's bank accounts
Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఎందరో గొప్ప మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. దీనితోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కడం లేదు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్ని రాజ్యాంగం ద్వారానే వచ్చాయి. దీంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నాయని రాహుల్ అన్నారు.
అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి.. క్రమంగా అన్నింటిని ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. పదేళ్లలో మోదీ విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలు విక్రయించారు. మోదీ పాలనలో కేవలం 2 శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి సంపద అంతా వెళ్తోందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసి వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేస్తామని రాహుల్ తెలిపారు.