HYD: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 1.253 కిలోల గంజాయి ఖైరతాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై వెళ్తున్న శ్రీను, సూర్యలను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.