VKB: పరిగిలో గత 10 రోజుల నుంచి వీధి దీపాల సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మున్సిపల్ పరిధి, కోర్ట్ చౌరస్తా నుంచి వెళ్లే ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు వెలగడం లేదు. 10 రోజుల నుంచి ఇదే సమస్య ఉందని పలువురు వాహనదారులు, కాలనీవాసులు వాపోతున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.