RR: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ ప్రేమ్ హాస్టల్లో వరంగల్ కాశీబుగ్గకు చెందిన శ్రేయ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న శ్రేయ శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.