AP: తిరుమలలో బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్తడే సందర్భంగా కేక్ కట్ చేయడంతో రేగిన వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివరణ ఇచ్చారు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదనే విషయం తమకు తెలియదని, తనూజతో తాము ఎగ్లెస్ కేక్నే కట్ చేయించామని పేర్కొన్నారు. తామే కేక్ తెచ్చామని, ఇందులో తనూజ పాత్ర ఏ మాత్రం లేదని తెలిపారు.