SKLM: కూటమి ప్రభుత్వం అటు ప్రజలను, ఇటు ఉద్యోగులను నిలువునా వంచిస్తోందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, అబద్ధపు ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో బతికిన ఆశా కార్యకర్తలను, కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు.