ATP: రాయదుర్గం ప్రజల కోసం ఈనెల 9న సోమవారం పట్టణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో కాలవ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల సీతా రామంజినేయ కళ్యాణ మండపంలో ఉ.10 నుంచి మ.3 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.