MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, మల్కాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పథకంలో మరమ్మతులు చేస్తుండడంతో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.