TG: అజ్ఞాతం వీడి 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్గఢ్ వాళ్లు, నలుగురు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఉన్నారని వెల్లడించారు. గత నాలుగైదు నెలల్లో సుమారు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. 46 మంది కమిటీ సభ్యులు, 76 మంది దళసభ్యులు ఉన్నారని పేర్కొన్నారు.