SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ మేట్టెక్కివలస గర్ల్స్ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కార్యక్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న వయస్సులోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకొని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.