AKP: మాడుగులలో మండల స్పెషల్ ఆఫీసర్ శివప్రసాద్, ఎంపీడీవో అప్పారావు ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో పెరిగిన తుప్పలు, డొంకలను తొలగించి కాలువల్లో పూడికను తీసి వీధులను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రత్యేకాధికారి కోరారు. తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు.