GNTR: తుళ్లూరు మండలం మందడం సీఆర్డీయే కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలోని తాగునీటి సమస్యపై చర్చించి, వచ్చే 10 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, అమరావతి పరిధిలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.