అన్నమయ్య: కేసుల్లో ఉన్న ముద్దాయిలు కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పెద్ద తిప్ప సముద్రం SI పరమేశ్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. కోర్టుకు హాజరు కాని ఇద్దరు ముద్దాయిలపై న్యాయాధికారి అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గత వారం రోజులుగా ఇదే తరహాలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.