Vegetable Peels : తొక్కే కాదా అని తీసేస్తున్నారా.. ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు
ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.
Vegetable Peels : చాలామంది వంట చేసేటప్పుడు కూరగాయల తొక్కలు(Vegetable Peels) తీసి పారేస్తుంటారు. వేస్టుగా పారేసే అవి చాలా ఉపయోగపడుతాయంటే నమ్ముతారా.. నిజమండి. ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఇంతకీ ఆ కూరగాయలు ఏవంటే..
క్యారెట్స్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. క్యారెట్ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పర్యావరణ కాలుష్య ప్రభావాన్ని, అతినీలలోహిత కిరణాల(UV Rays)తో పోరాడటంలో సాయపడతాయి. క్యారెట్(Carrot) తొక్కలు మీ చర్మాన్ని యవ్వనంగా, మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. క్యారెట్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ యాంటీఆక్సిడెంట్లు(Antioxidants). ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మాన్ని బలోపేతం చేసే కొల్లాజెన్(Collagen) ఉత్పత్తికి కూడా విటమిన్ సి సహాయపడుతుంది.
కీరదోసకాయ(Cucumber)లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కీరదోసకాయ తొక్క మంట, చర్మ ఎరుపును తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. కీరదోసలో మన చర్మానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీంతో మీ చర్మం అందంగా మెరుస్తుంది.
గుమ్మడికాయ(pumpkin) తొక్క చర్మాన్ని మృదువుగా, అందంగా చేస్తుంది. వీటి తొక్కలలో సహజ ఎంజైమ్లు(Natural enzymes) ఉంటాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి.వీటిలో జింక్(Zink), విటమిన్ ఎ, విటమిన్ సి లు ఉంటాయి. ఈ తొక్క చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం(Potassium) ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ తొక్కల్లో విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి, నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బంగాళదుంప తొక్కను ప్రతిరోజూ ముఖానికి అప్లై చేసి కాసేపటి తర్వాత ముఖాన్ని కడిగేయాలి.