NZB: మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రజపరిషత్ కార్యాలయంలో మొదటి విడుత ZPTC,MPTC ఎన్నికలకు నామినేషన్ లను గురువారం స్వీకరించారు. మండలంలో 11 MPTCలు, ఒక్క ZPTC ఉన్నాయి. మండలంలో ఓటర్లు మొత్తం 30896 మంది ఉన్నారు. మొదటి రోజు మాక్లూర్ 2వ ఎంపీటీసీకి కాంగ్రెస్ పార్టీ నుంచి సాయినేని వెంకటేశ్వర్ రావు నామినేషన్ వేసినట్లు మండల అభివృద్ధి అధికారి బ్రహ్మానందం రెడ్డి తెలిపారు.