KMM: చేగువేరా స్ఫూర్తితో మతోన్మాద ధోరణులకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. గురువారం ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక దళిత వర్గానికి చెందిన న్యాయవేత్తపై బూటుతో దాడి చేయడం అత్యంత అమానుషమని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.