ప్రకాశం: దీపావళి టపాసులు అనుమతులు లేకుండా నిల్వచేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖరపురం SI ఎం వెంకటేశ్వర నాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పలు షాపులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు అమ్మడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.